హాజీపూర్‌లో పెద్దపులి సంచారం.. మూగజీవాలపై దాడి

byసూర్య | Wed, Oct 30, 2024, 07:32 PM

మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం బుగ్గగుట్ట అటవీ ప్రాంతంలో పెద్దపురి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారం వార్తలతో గత నాలుగు రోజులుగా హాజీపూర్ మండల వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల జనాలు కూడా తీవ్ర ఆందోళనకు గురవున్నారు. అయితే.. ఆదివారం (అక్టోబర్ 27న) రోజున రాత్రి సమయంలో.. ఓ గొర్రెల మందపై పెద్దపులి దాడి చేయగా.. అందులో రెండు మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఒక గొర్రెను చంపి తినడంతో పాటు ఇంకో గొర్రెను లాక్కెళ్లినట్లు సమాచారం. గొర్రెల కాపరులు, గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు ఇచ్చిన సమాచారంతో.. సోమవారం (అక్టోబర్ 28న) ఉదయం సంఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. రెండు రోజులుగా అటవీ శాఖ అధికారులు పాదముద్రల కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో కూడా పులి జాడ కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు.


అయితే.. ఆదివారం రోజున మూగజీవాల మీద దాడి చేసింది చిరుత పులా లేక పెద్దపులా అనే అంశంపై అటు గ్రామస్థులు, ఇటు అటవీ అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. జన్నారం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి గత వారం రోజులుగా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు 4 రోజుల క్రితమే గుర్తించినట్లు సమాచారం. లక్షెట్టిపేట మండలంలోని హన్మంతుపల్లి బీటు, హాజీపూర్‌ మండలం ధర్మారం బీటు పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో దొరికిన పాదముద్రల ఆధారంగా అవి పెద్దపులివేనని గుర్తించినట్లు సమాచారం. దీంతో.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయటంతో.. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా భయం భయంగా బతుకున్నారు. ఎప్పుడు ఎటునుంచి పెద్దపులి దాడి చేస్తుందోనని గజగజా వణికిపోతున్నారు.


అయితే.. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవటం గమనార్హం. సిబ్బంది అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడల వివరాల సేకరణతో పాటు వేటగాళ్ల బారిన పులి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.


Latest News
 

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM