తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత

byసూర్య | Wed, Oct 30, 2024, 10:55 PM

తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి. వాతావరణంలో ఉన్నట్లుండి అనుహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండ గాలులు, కొన్ని చోట్ల చలివాతావరణం ఉంటుంది. అయితే నేడు తెలంగాణలో వాతావరణం ఎలా ఉందో ఓ సారి చూద్దాం. గత వారం క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆవర్తనంగా మార్పు చెంది బలహీనపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఆవర్తనం కూడా పూర్తిగా బలహీనపడుతున్నట్లు చెప్పారు.


దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఏమాత్రం అవకాశం లేదని చెప్పారు. అయితే మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొని ఉంది. తెలంగాణలో చల్లని గాలులు వీస్తున్నాయి, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని జిల్లాల్లో వేడి గాలులు వీస్తున్నాయి.


అర్ధరాత్రి తర్వాత, వేకువజామున, ఉదయం వేళల్లో పొగ మంచు కప్పుకుంటుంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి తగ్గిపోతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత పటాన్‌చెరులో 18.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మెదక్‌లో 18.8 డిగ్రీల సెంటీగ్రేడ్, రాజేంద్రనగర్‌లో 19.5 డిగ్రీల సెల్సియస్, హకీంపేటలో 20.3, మహబూబ్‌నగర్‌లో 21.6 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు.


కొన్ని జిల్లాల్లో మాత్రం రాత్రి చలి.. పగలు వేడి వాతావరణం ఉంటోందని చెప్పారు. ఆదిలాబాద్‌లో మంగళవారం (అక్టోబర్ 29) పగటిపూట సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగు డిగ్రీలు అధికంగా 35.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఇక ఖమ్మంలో 3.3, హైదరాబాద్‌ నగరంలో 2.2, హనుమకొండలో 2 డిగ్రీలు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Latest News
 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 13, 2025, 06:42 AM
నామినేట్ పోస్టుల్లో మున్నూరు కాపులకు అన్యాయం Sat, Jul 12, 2025, 08:20 PM
కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నరు: హరీశ్ Sat, Jul 12, 2025, 08:15 PM
రెండు రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఆమోదం: కొండా సురేఖ Sat, Jul 12, 2025, 08:14 PM
త్వరలో కొత్త పార్టీ పెడుతాం: తీన్మార్ మల్లన్న Sat, Jul 12, 2025, 08:13 PM