మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం

byసూర్య | Wed, Oct 30, 2024, 10:49 PM

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించింది. మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై ఒక సంవత్సరం నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది అక్టోబర్ 30, 2024 (నేటి నుంచి) అమలులోకి వస్తుందని ప్రకటించింది.మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మయోనైజ్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రానికి నిషేధానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్తీ ఆహారం తీసుకొని పలువురు అనారోగ్యం పాలవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌లో తరుచూ తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, ఐదు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్నారు.మయోనైజ్‌ ఎక్కువగా బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్, ఇతర ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకొని తినే ఆహార పదార్థం. మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. ఉడికించని పదార్థం కాబట్టి మయోనైజ్‌లో హానికర బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ మయోనైజ్ కారణంగా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హోటళ్లు తీరు మార్చుకోకపోవడంతో ఫుడ్ సేఫ్టీ విభాగం రంగంలోకి దిగి నిషేధం విధించాలని నిర్ణయించింది.బంజారాహిల్స్, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో మయోనైజ్‌ను తిన్నవారు అనారోగ్యానికి గురైనట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని పలు హోటళ్లలో దాడుల సమయంలోనూ నాసిరకం మయోనైజ్‌ను అధికారులు గుర్తించారు. అదేవిధంగా, సికింద్రాబాద్, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్ల పైనా బల్దియాకు ఫిర్యాదులు అందాయి.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM