byసూర్య | Wed, Oct 30, 2024, 07:09 PM
సిద్ధిపేట జిల్లా దుబ్బాక లో క్యూభా పై అమెరికా అనేక సంవత్సరాలుగా నిర్భంధాన్ని, ఆంక్షలను విధిస్తూ ఆర్థిక వాణిజ్యాన్ని దెబ్బతెస్తున్నదని CITU ఆద్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా CITU జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మట్లాడుతూ అమెరికా నిరంకుశ విధానాలతో క్యూబా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.ప్రపంచ వ్యాప్తంగా క్యూభా పై అమెరికా సామ్రాజ్యవాదం విధించిన నిర్భందాన్ని - ఆక్షలను వెంటనే ఎత్తివెయ్యాలని డిమాండ్ చేశారు.
2024 ఆక్టోబర్ 28, 29 తేదీలలో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో “ క్యూభా పై అమెరికా సామ్రాజ్యవాదం విధించిన ఆంక్షలను ఎత్తి వేయాలని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చెయ్యాలని డిమాండు చేశారు.ఈరొజు CITU గా దేశవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు, నిరసనలు తెలియజేస్తున్నామని తెలిపారు.
వ్యవసాయ రంగాలకు వర్తించే పరికరాలపై అమెరికా ఉద్దేశపూర్వకంగా నిషేధాలు మరియు పరిమితులను అమలుచేస్తున్నదని వీటిఫలితంగా చికిత్సలకు ఉపయోగించే మందులు, ఔషధాలు,విడి భాగాలు మరియు నవజాత శిశువుల సంరక్షణకు వాడే కొత్త పరికరాల కొరత ఏర్పడుతోందని అన్నారు.
ఉత్పత్తికి ఉపయోగించేందుకు వాడే ముడి పదార్థాలు లేక ఇతర ఉత్పత్తులు నిలిచిపోయాయని క్యూబా నేడు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూబాపై అమెరికా విధించిన వాణిజ్య మరియు ఆర్థిక దిగ్బంధనమే కారణం అన్నారు. వెంటనే ఈ నిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో CITU నాయకులు కంపెల్లి భాస్కర్, బత్తుల రాజు, మేరుగు రాజు, మల్లేశం, సాజిద్, లక్మి నర్సయ్య, రమేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.