ఇంటింటి సర్వే పక్కా నిర్వహణకు సన్నద్ధం కావాలి...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

byసూర్య | Wed, Oct 30, 2024, 06:59 PM

కుటుంబాల సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులు తెలుసుకునేందుకు నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి ఇంటింటి సర్వే నిర్వహణ సన్నద్ధతను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాష్ట్రంలోని కుటుంబాల  ఆర్థిక, విద్య, సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం  తీసుకుందని, దీనికి తగిన విధంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.ప్రతి 150 కుటుంబాలను సర్వే చేసేందుకు ఒక ఎన్యుమరేటర్ ను ఎంపిక చేయాలని, ఎన్యుమరేటర్ లకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని, ఇంటింటి సర్వే నిర్వహించేందుకు వారికి అవసరమైన పరికరాలు రూట్ మ్యాప్ మొదలగు సహాయ సహకారాలు అందజేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కుటుంబాల ఆర్థిక సామాజిక విద్యా స్థితిగతుల వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే అధ్వర్యంలో గాంధీ నగర్‌లో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు Wed, Oct 30, 2024, 08:51 PM
పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM