రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి నెలపై కూర్చొని నిరసన తెలిపిన ఏఈఓలు

byసూర్య | Wed, Oct 30, 2024, 06:54 PM

పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ రైతు వేదిక లో రైతు నేస్తం - వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం లో మండలం లోని ఏఈఓ లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నేల పై కూర్చొని నిరసన తెలియజేసారు.కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన డీసీఎస్ సర్వే మిగితా 11 రాష్ట్రాల ల లోగా మన రాష్ట్రం లో కూడా ప్రైవేటు ఏజెన్సీ కి ఇచ్చి 1000 ఎకరాల కు ఒక వ్యక్తి నీ మించకుండా చేయాల్సి ఉంది, అందుకు గాను ప్రతి ఫారం కు నిధులు కూడా వచ్చాయి , ఇవే నిధులను మిగితా 11 రాష్ట్రాల ప్రైవేటు ఏజెన్సీ లకు ఇచ్చి చెపిస్తున్నాయి.కానీ ఇందుకు భిన్నంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ లో అగ్రికల్చర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ & కమిషనర్ మన రాష్ట్రం లో ఈ పని నీ ఇదివరకే వివిధ పథకాలు , శాఖ పరమైన విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈఓ)లతో బలవంతంగా చెపించడాన్ని పై అధికారుల , ప్రజా ప్రతినిధుల దృష్టి కి తీసుకెళ్తున్న తరుణం లో ఈ డీసీఎస్ సర్వే కే సంబంధం  లేని రైతు భీమా పథకాన్ని బూచి గా పెడుతూ రాష్ట్రం లో అమాయకులైన 165 మంది ని సస్పెండ్ చేయడం జరిగింది.
ఇట్టి నకిలీ సస్పెన్షన్స్ ను రద్దు చేయాలి అని బుదవారం (23 అక్టోబర్) నాడు వ్యవసాయ డైరెక్టర్ ని కలిస్తే అదే రోజు  సాయంత్రం లోగా సస్పెన్షన్ రద్దు చేస్తామని ఇప్పటి వరకు కూడా రద్దు చేయలేదు.
అలాగే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ కు వచ్చిన అట్టి నిధులు ఏం అయ్యయో కూడా అర్థం కావడం లేదు.ఈ ఏపీసీ నియంతృత్వ ధోరణి నీ నిరసిస్తూ అలాగే వెంటనే సస్పెన్షన్స్ రద్దు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది.మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కేవలం మా పై అధికారుల ధోరణి కే వ్యతిరేకం.


Latest News
 

ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని పాదయాత్ర చేపట్టనున్న బీజేపీ Tue, Nov 12, 2024, 08:04 PM
పేద రైతులతో మాట్లాడాల్సిన సీఎం తన విధిని మరిచాడని విమర్శ Tue, Nov 12, 2024, 08:02 PM
గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. దైవ సన్నిధిలోనే మృత్యు ఒడికి Tue, Nov 12, 2024, 07:55 PM
'నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి'.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ Tue, Nov 12, 2024, 07:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో నలుగురు జీ ఎమ్మెల్యేలకు నోటీసులు Tue, Nov 12, 2024, 07:52 PM