ప్రతి ఉద్యోగి కి ఉద్యోగ విరమణ సహజం

byసూర్య | Wed, Oct 30, 2024, 06:51 PM

నర్సంపేట పట్టణంలోని జెడ్పి ఎస్ఎస్ మోడల్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలు రజిని కుమారి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శాంతకుమారి అధ్యక్షత వహించగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నిస్వార్థపూరితమైందని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తారని ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత వ్యక్తుల వారి భవిష్యత్తు తీర్చిదిద్దాలనే తపనతో విధులు నిర్వహిస్తారని అన్నారు.
ప్రతి ఉద్యోగికి ఉద్యోగ ధర్మం ప్రకారం పదవి విరమణ తప్పనిసరి అని ఉద్యోగ విరమణ పొందిన రజిని కుమారి గారి శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని అవకాశాలను బట్టి వారి యొక్క సేవలను విద్యార్థులకు అందించాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయుల సమూహం రజిని కుమార్ గారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యాం ప్రసాద్, వేణుగోపాల్, మురళి ,రవి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్ ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు ఉత్తంకుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


Latest News
 

చింత‌ల‌బ‌స్తీలో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Fri, Jun 13, 2025, 08:36 PM
జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం: తలసాని Fri, Jun 13, 2025, 08:34 PM
KTRకు నోటీసులు.. రాజకీయ కక్ష సాధింపే: హరీశ్ రావు Fri, Jun 13, 2025, 08:31 PM
తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు! Fri, Jun 13, 2025, 08:29 PM
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి Fri, Jun 13, 2025, 08:26 PM