byసూర్య | Wed, Oct 30, 2024, 08:42 PM
TG: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన హైడ్రా సరికొత్తగా ప్రజల్లోకి వెళ్తోంది. నగర ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. గోషామహల్ ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్‌లో 50 మంది హైడ్రా వాలంటీర్లు మొదటి విడతలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరంతా నగరంలోని ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో సేవలు అందించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.