రాత్రిపూట బట్టలు లేకుండా డ్యాన్స్‌ చేయిస్తున్నారు.. నేనక్కడ ఉండలేను నాన్నా

byసూర్య | Wed, Oct 30, 2024, 10:41 PM

తెలంగాణలోని గురుకులాలు నిత్యం ఏదో ఓ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తరచూ విద్యార్థులకు.. ఫుడ్ పాయిజన్‌‌ అవుతూ ఆస్పత్రుల పాలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండగా.. పిల్లల పట్ల కొందరు ఉపాధ్యాయులు ప్రవర్థిస్తున్న తీరు కూడా వివాదాస్పదమవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవన్నీ కాకుండా.. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థులు ఓ విద్యార్థి పట్ల ప్రవర్థిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదివుతున్న విద్యార్థి పట్ల.. అదే తరగతికి చెందిన మరో 15 మంది విద్యార్థులు అనుచితంగా ప్రవర్తిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఆ విద్యార్థే తన తండ్రికి చెప్పుకుంటూ బోరున విలపించటంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థులు.. రాత్రి పూట గది తలుపులు మూసి బట్టలు లేకుండా తనతో డ్యాన్స్‌ చేయిస్తున్నారని, చేయకపోతే కొడుతున్నారని.. నిద్ర లేవకపోతే దుప్పటి లాగేసి ఇబ్బంది పెడుతున్నారంటూ తండ్రితో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయాలు ఎవరికైనా చెబితే.. నీ సంగతి చూస్తామంటూ బెదిరించారని చెప్పుకొచ్చారు. దసరా సెలవులకు వెళ్లొచ్చినప్పటి నుంచి.. ఇలాంటి చేష్టలు మరింత ఎక్కువయ్యాయని.. తాను అక్కడ ఉండనంటూ బోరున విలపించాడు ఆ చిన్నారి.


ఆదివారం (అక్టోబర్ 27న) రోజున తన బంధువుల సాయంతో బాధిత విద్యార్థి ఇంటికి చేరుకుని.. తన తండ్రికి జరిగిన విషయమంతా వివరించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కుమారుడు పడిన బాధ విని తీవ్ర ఆగ్రహానికి లోనైనా ఆ తండ్రి వెంటనే.. ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి సీరియస్ అయ్యాడు. దీంతో.. సదరు విద్యార్థులను ప్రిన్సిపల్ మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం.. బాధిత విద్యార్థిని స్కూల్‌కి పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుని.. ఇబ్బంది పెట్టిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి పనులకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం.


  ఇదిలా ఉంటే.. ఇటీవలే ఏపీలోనే కర్నూలు జిల్లాలో సీనియర్ విద్యార్థులు జూనియర్పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. రాయలసీమ విశ్వవిద్యాలయంలో సునీల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిపై 15 మంది సీనియర్లు దాడి చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని.. కొంతమంది సీనియర్లంతా కలిసి పరిచయ వేదిక పేరుతో విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. గ్రౌండ్‌లో పరిగెత్తించడంతో పాటు విచక్షణరహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన సునీల్ను మిగతా విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM