పోలీసుల అధ్వర్యంలో రక్తదాన శిబిరం

byసూర్య | Wed, Oct 30, 2024, 06:48 PM

నర్సంపేట పట్టణంలో పోలీస్ అమరవీ- రుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నర్సంపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సిటిజెన్ క్లబ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఏసీపీ కిరణ్ కుమార్,సీఐలు,ఎస్సైలు, కానిస్టేబుల్ పాల్గోనీ రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ మాట్లాడుతూ సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.
పోలీసు అమ- రుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసినప్పుడే వారు త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు.వారి సేవలను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఆరోగ్యంగా ఉండే వారంతా ఆరు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని తెలిపారు.అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్, సిఐలు డి.రమణ మూర్తి, ఎం.సాయి రమణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే అధ్వర్యంలో గాంధీ నగర్‌లో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు Wed, Oct 30, 2024, 08:51 PM
పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM