కంగ్టి గ్రామలో కుక్కల బెడదను నివారించాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 06:43 PM

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కుక్కలు,పందుల బెడదా నుండి ప్రజలను కాపాడాలని సోమవారం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కి కెవిపిఎస్ కంగ్టి మండల అధ్యక్షులు హాలిగే దాస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ మాట్లాడుతూ...కంగ్టి మండల కేంద్రంలో కుక్కలు, పందులు  విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు.వీధి కుక్కలు చిన్నారులు మొదలుకొని పెద్దవారి వరకు ముక్కుమడిగా  దాడి చేస్తున్నాయని అన్నారు.
ఇప్పటికే ఈ సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారి ఇన్చార్జ్ (ఎంపీవో ) కి సమస్యను పరిష్కరించమని చెప్పడం జరిగింది. అలాగే మండల అధికారుల దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా కుక్కల దాడి నుండి పందుల బెడద నుండి ప్రజల ప్రాణం కాపాడాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) డిమాండ్ చేస్తుందని అన్నారు.


Latest News
 

మన గ్రోమోర్ సేవలను సద్వినియోగం చేసుకోండి Fri, Apr 18, 2025, 04:28 PM
ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలి Fri, Apr 18, 2025, 04:25 PM
భగవాన్ బుద్ధుని జయంతి పోస్టర్ లు ఆవిష్కరణ Fri, Apr 18, 2025, 04:23 PM
మే 20న జాతీయ సమ్మె Fri, Apr 18, 2025, 04:20 PM
నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే చట్ట పరమైన చర్యలు Fri, Apr 18, 2025, 04:18 PM