byసూర్య | Wed, Oct 30, 2024, 06:34 PM
బూత్ స్థాయిల్లో ఓటరు ముసాయిదా జాబితాలను ప్రదర్శించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గంలోని 1133 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాలను ప్రదర్శింపచేయాలని ఆయన తెలిపారు.
వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాలతో పాటు నారాయణపేట 4 మండలాలు, మహబూబ్ నగర్ (2) మండలాలు గండిడ్, మామదాబాద్ లలోని బూత్ స్థాయి అధికారులు మంగళవారం ఓటర్ ముసాయిదా జాబితాలను కార్యాలయ నోటీస్ బోర్డులలో ప్రదర్శింపచేయాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రజలందరికీ జాబితాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లయితే జాబితాలో తమ పేర్లు నమోదు కాని ఎడల 18 సంవత్సరాలు నిండిన యువత జనవరి 1, 2025 నాటికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.l