byసూర్య | Wed, Oct 30, 2024, 06:28 PM
జగిత్యాల జిల్లా .బీర్పూర్ మండలం లోని బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమాన్ వద్ద గల విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయగా ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసు వారితో మాట్లాడి విషయం గురించి తెలుసుకోవడం జరిగింది
పోలీస్ వారు మాట్లాడుతూ బీర్పూర్ మండలానికి చెందిన ఒక ట్రాక్టర్ డ్రైవర్ నిన్న సాయంత్రం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బ్రేక్స్ ఫెయిల్ అయి అదుపుతప్పి కమాన్ వద్ద గల ఆంజనేయస్వామి విగ్రహానికి గుద్దుకోవడం జరిగింది. పోలీసు వారు నిందితులను అదుపులోకి తీసుకోగా నిందితుడు దానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించి మరల నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల అధ్యక్షులు ఆడెపు నర్సయ్య, మాజీ జెడ్పిటిసి పాత పద్మా రమేష్, బీర్పూర్ మాజీ సర్పంచ్ గర్శకుర్తి శిల్పా రమేష్, మహేష్ యాదవ్, గాజోజి భాస్కర్,రవి మరియు విశ్వహిందూ పరిషత్ నాయకులు మరియు స్థానిక గ్రామ యువకులు మరియు నాయకులు పాల్గొన్నారు.