byసూర్య | Wed, Oct 30, 2024, 06:25 PM
తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ బిల్లుల చెల్లింపు మరియు పెండింగ్ నాలుగు డీఏ లు చెల్లింపు, పీఆర్సి అమలు వంటి సమస్యలపై రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న నాలుగు దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా నేడు వికారాబాద్ మండల తాహసిల్దారు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. మండల అధ్యక్షులు రాఘవేందర్ గుప్తా మాట్లాడుతూ ఐదు డీఏ లు పెండింగ్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒకటి మాత్రమే ప్రకటించడం చాలా అన్యాయం అని అన్నారు. వేతనాలపై ఆధారపడి జీవించే ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయంగా రావలసిన డి ఏ ల కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మిగతా పెండింగ్ డీఏ లను వెంటనే ప్రకటించాలని పిఆర్సి నివేదిక తెప్పించుకొని తెలంగాణ రాష్ట్రంలో రెండవ పియార్సి ని 50% ఫిట్మెంట్తో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న జిపిఎఫ్, సరెండర్ లీవ్ మెడికల్ బిల్లులను, మార్చి-24 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలు గ్రాట్యుటీ , కమ్యుటేషన్, సంపాదిత సెలవులను నగదు రూపంలో వెంటనే చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు కొత్తగడి అంజిరెడ్డి, తపస్ రాష్ట్ర బాధ్యులు జాక వెంకటేశం, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ కుమార్, సంగమేశ్వర్, హమ్మయ్య, మండల మహిళా కార్యదర్శి అనురాధ ఉపాధ్యాయులు బస్వరాజు, అంజిరెడ్డి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.