byసూర్య | Wed, Oct 30, 2024, 08:51 PM
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకుండా బీఆర్ఎస్ అడ్డుకున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంబరాల్లో భాగంగా ముషీరాబాద్ లోని గాంధీ నగర్ డివిజన్లోని ఆంధ్ర కేప్ చౌరస్తాలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జైసింహ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.