byసూర్య | Wed, Oct 30, 2024, 07:14 PM
పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట, దూలికట్ట మరియు జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, వడ్కాపూర్, కాచాపూర్, కుమ్మరికుంట, కోనారావుపేట గ్రామాల్లో మంగళవారం రోజున ధాన్యం కోనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ..రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. అలాగే రైతన్నలకు పంటల పెట్టుబడికి రుణాలు ఇచ్చినట్టు చెప్పారు. టెక్నికల్ ఇబ్బందుల వల్ల మిగిలిన కొంతమంది రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు. సన్న వడ్లు వేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చెప్పి వాటిని కొనుగోలు చేయకుండా మోసం చేశారని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు సన్న వడ్లను కొనుగోలు చేయడమే కాకుండా వాటికి క్వింటాలుకు రూ.5 వందల బోనస్ అందిస్తున్నదని చెప్పారు. ఏనాడు రైతుల సంక్షేమానికి పాటుపడని, రుణమాఫీ చేయని బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి కొనుగోలు సెంటర్ లోనూ వడ్ల కటింగ్ లేకుండా తాను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కొనుగోల్లు జరుపుతున్నట్టు చెప్పారు. రైతులు ఎంతకాలం తనకు తమ ఆశీర్వాదాలు అందిస్తారో అంతకాలం వడ్ల కటింగ్ అనేది ఉండదని స్పష్టం చేశారు.
నిత్యం రైతుల కోసం పనిచేసే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రైతుల కోసం తాము ఎంత సాధ్యమైతే అంతవరకు పనిచేస్తానని, వారి కళ్ళలో ఆనందం ముఖాల్లో చిరునవ్వు చూడటం తన జీవిత లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్, దూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు,కాంగ్రెస్ పార్టీ ఎలిగేడు మండల అధ్యక్షులు సామా రాజేశ్వర్ రెడ్డి, జూలపల్లి మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ మరియు డైరెక్టర్లు, మాజీ జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు లోక జలపతి రెడ్డి, ధరవేణి నర్సింగ్ యాదవ్, కొమ్ము పోచాలు, హర్షణపెల్లి వెంకటేశ్వర్ రావు, పుల్ల రావు, పర్శరాములు,వామన్ రావు, భూమేష్, సత్తన్న, సంతోష్ రావు,సిరికొండ కొమురయ్య, గొట్టేముక్కలు రవీందర్ రెడ్డి,బండి స్వామి, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు,రైతుల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.