byసూర్య | Wed, Oct 30, 2024, 04:13 PM
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎప్పుడో రిటైర్‌మెంట్ ఇచ్చారని ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ ఎన్నటికి పోదని అన్నారు. ఆ పార్టీకి ప్రజలు ఎన్నడో రిటైర్‌మెంట్ ఇచ్చేశారని కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నేడు ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని ఫైర్ అయ్యారు. మరోవైపు రేవ్ పార్టీలంటూ కేటీఆర్ చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. జన్వాడ ఫామ్‌హౌస్ కేసు లో నిందితులను అరెస్ట్ చేస్తే తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను రేవంత్ సర్కార్ మళ్లిస్తుందని ఆరోపించారు. సుమారు రూ.వెయ్యి కోట్ల గ్రామీణ నిధులను అక్రమంగా వాడేశారని తెలిపారు. కేంద్రానికి సమర్పించాల్సిన బిల్లులను కూడా నేటికీ సబ్మిట్ చేయడం లేదని మండిపడ్డారు. నిధులు లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.సుందరీకరణ పేరుతో డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇందిరమ్మ కమిటీల్లో తమ భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొమ్ము ఒకరిది.. సొకు మరొకరిది అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభల్లో తీర్మానం చేసిన ఇందిరమ్మ కమిటీ లో చెల్లుబాటు కావని.. ఈ విషయంలో తాము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు.