byసూర్య | Wed, Oct 30, 2024, 04:07 PM
వికారాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో రూ. 1.14 కోట్లతో నూతనంగా నిర్మించే 24 దుకాణాల సముదాయానికి ఈరోజు భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్
పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీమతి చిగుళ్ళపల్లి మంజుల రమేశ్, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, కూరగాయల వ్యాపారులు, ప్రజలు.
వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికులకు యూనిఫాం దుస్తులను పంపిణీ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
ఈ సందర్భంగా జరిగిన సభలో సభాపతి ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ వికారాబాద్ మార్కెట్ కమిటీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేసుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి గారు అనుమతులు ఇచ్చారు, కాబట్టి అవసరమైన పనులు చేసుకోవచ్చు.
మార్కెట్ లో అవసరమైన ఇతర వసతులకు కూడా నిధులు మంజూరు చేయిస్తాను. గతంలో అధికారంలో ఉన్న పార్టీ పది సంవత్సరాలలో చేసిన తప్పులు, స్కాం లతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు.
కేటీఆర్, హరీష్ రావులు గతంలో చేసిన తప్పులను, ఇచ్చిన జీఓ లను మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి దెబ్బకి వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు.
రేవంత్ రెడ్డి యువకుడు, కష్టపడే నాయకుడు, ఇచ్చిన హామీలను అమలు చేస్తారు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే వరకు విశ్రమించరు. వచ్చే అయిదేళ్ళలో వికారాబాద్ నియోజకవర్గాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేస్తాను. వుడా ఏర్పాటుతో జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతుంది. పట్టణాలు, గ్రామాలలో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. వికారాబాద్ చుట్టూ రూ. 850 కోట్లతో రింగ్ రోడ్డు రాబోతుంది. పట్టణంలో ప్రజల సౌకర్యం కోసం అన్ని రకాల మౌళిక వసతులు అభివృద్ధి చేస్తాం.