జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
byసూర్య |
Wed, Oct 30, 2024, 03:59 PM
దీపావళి పండగ వేళ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు పండగకు ముందే జీతాలు విడుదల చేసింది.ఈ మేరకు ఉద్యోగుల జీతాల చెల్లింపుకు అవసరమైన రూ.120 కోట్లును సర్కార్ విడుదల చేసింది. కాగా ఎల్లుండి నవంబర్ 1 వ తేదీన ఉద్యోగులకు జీతాలు జమ కావాల్సి ఉంది. అయితే దీపావళి నేపథ్యంలో ఒకటో తారీకు కంటే ముందే జీతాలు విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Latest News