byసూర్య | Wed, Oct 30, 2024, 03:55 PM
ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ సహజమని ఎస్పీ రూపేష్ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఐ చంద్రశేఖర్ను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ, చంద్రశేఖర్ జిల్లా పోలీస్ శాఖలో ఎనలేని సేవలు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్స్ వెంకటేశం, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్. ఐ. రామారావ్, ఆర్. ఎస్. ఐ. బి. హన్మంత్ రెడ్డి, కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.