byసూర్య | Wed, Oct 30, 2024, 03:54 PM
తేమ శాతం పేరుతో పత్తి రైతులను ఇబ్బందులు పెట్టరాదని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివారెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట మండలం లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల నాణ్యమైన పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. వైస్ చైర్మన్ హన్మంతు, నాయకులు పాల్గొన్నారు.