మోదీ పాలన చూసి బిజెపిలో చేరుతున్న యువత

byసూర్య | Wed, Oct 30, 2024, 03:49 PM

నరేంద్ర మోడీ పాలన చూసి యువత బిజెపిలో చేరుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో సోమవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అసాంఘిక శక్తుల, ఉగ్రముకల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. బిజెపి అధికారంలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్న నమ్మకం ప్రజలలో ఏర్పడిందని అన్నారు.
ఫలితంగా బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వివరించారు. కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 30 వేలకు పైగా సభ్యత్వం నమోదు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొన్న నాయకులను ఆయన అభినందించారు. క్రియాశీల సభ్యత్వ నమోదు మరింత పెంచాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, నాయకులు యాదగిరి బాబు, దొనికెల నవీన్, వడ్డేపల్లి శ్రీనివాస్, రుద్ర శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, తుకారాం గౌడ్, జైపాల్ రెడ్డి, భాయ్ లింగారెడ్డి, గోపిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ రికార్డు.. చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ విజయం Fri, Nov 14, 2025, 04:42 PM
"ప్రజల గొంతుకగా పోరాటం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు" Fri, Nov 14, 2025, 04:38 PM
జూబ్లీహిల్స్ విజయంతో ఊపందుకున్న కాంగ్రెస్.. లోకల్ బాడీ ఎన్నికలకు సన్నాహం Fri, Nov 14, 2025, 04:30 PM
రేవంత్ రాజకీయ చాణక్యం.. కాంగ్రెస్‌లో సీనియర్ల సవాల్‌ను సైలెంట్‌గా తిప్పికొట్టిన సీఎం Fri, Nov 14, 2025, 04:26 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ Fri, Nov 14, 2025, 04:13 PM