హృదయాన్ని కదిలించిన సజ్జనార్ ట్వీట్..

byసూర్య | Wed, Oct 30, 2024, 03:42 PM

వారు వృద్ధ అంధ దంపతులు.. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు పెళ్లి చేసుకోని వెళ్లిపోయాడు. చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు.. కానీ భార్యతో విడిపోయాడు.అతను నాలుగేళ్లుగా వృద్ధ అంధ దంపతుల తల్లిదండ్రులే వద్ద ఉంటున్నాడు. అయితే అతను ఇంట్లో చనిపోయాడు. కానీ ఆ విషయాన్ని వృద్ధ దంపతులు గమనించలేకపోయారు. నాని.. నాని అటూ రోజుల నుంచి పిలుస్తూనే ఉన్నారు. తమ కుమారుడు తమని వీడిపోయారని వారు గ్రహించలేకపోయారు. చివరి పోలీసులు వచ్చి చెప్పడంతో అయ్యో దేవుడా.. అంటూ రోదించారు.ఈ ఘటన హైదరాబాద్ నాగోల్ పరిధిలోని జైపురి కాలనీలో జరిగింది. ఈ కాలనీలో రమణ, శాంతకుమారి అనే వృద్ద దంపతులు ఉన్నారు. వీరికి కళ్లు కనిపించవు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. చిన్న కుమారుడు ప్రమోద్ కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ భార్యతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. మద్యం తాగి వచ్చిన ప్రమోద్ పడుకున్నాడు. నిద్రలోనే కన్ను మూశాడు. అయితే ఈ విషయాన్ని ఆ అంధ తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు.


వారు ప్రమోద్.. ప్రమోద్ అని అంటూనే ఉన్నారు. కానీ ప్రమోద్ పలకడం లేదు. ప్రమోద్ చనిపోయిన మూడు రోజుల తర్వాత దర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి వెళ్లగానే ప్రమోద్.. ప్రమోద అంటూ దీనంగా పిలుస్తన్నారు. వారు నడవలేని, కదల్లేని స్థితిలో ఉన్నారు. వారిని చూసిన సీఐ సూర్యనాయక్ చలించిపోయాడు. వారికి కాస్త ఆహారం అదించాడు. మీ కుమారుడు చనిపోయాడని చెప్పారు. దీంతో ఆ వృద్ధ దంపతులు రోదించిన తీరు అక్కడి వారిని కదిలించింది.


ఆ తర్వాత పెద్ద కుమారుడికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఎమోషనల్ ట్వీట్ చేశారు. " కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే హృదయవిదారక సంఘటన! హృదయం కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్న హేయమైన ఘటన ఇది. మాయమవుతున్న మనిషితత్వానికి మాయని మచ్చ ఇది.


ఇలాంటి మనుషుల మధ్యన మనం కూడా మనుగడ సాగిస్తున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. అంగారక గ్రహం మీద కూడా అడుగు పెట్టాలనుకుంటున్న మనిషి.. పక్క మనిషి బాధల్లోకి, మనుసుల్లోకి తొంగి చూడలేకపోవడం బాధాకరం. ఎక్కడికి ఈ పరుగు.. ఎక్కడికి ఈ గమ్యంలేని పయనం. నాలుగు రోజులు తిండి నీళ్లు లేకుండా ఆకలికి అలమటించిన ఆ వృద్ద దంపతులకు కాదు చూపులేనిది, మనకే, మన సమజానికే. మనిషి - స్పందించు!!" అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM