పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

byసూర్య | Wed, Oct 30, 2024, 03:41 PM

ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కోదాడ పట్టణ సిఐ రాము అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా సోమవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు మహేంద్ర యూత్ అధ్యక్షులు లాజర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతూ సమాజం ప్రశాంతంగా నిద్రిస్తుంటే పోలీసులు తెల్లవారులు  మేలుకొని ఉంటారని తెలిపారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు.
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మార్కండేయ, అధ్యక్షులు లాజర్ వివిధ పార్టీల నాయకులు షేక్ నయీమ్, పంది తిరపయ్య,షరీఫ్, నజీర్,కర్ల సుందర్ బాబు, అలిమ్, రాహుల్,వేణు, గణేష్ తదితరులు పాల్గొన్నారు......


Latest News
 

అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి : మంత్రి శ్రీధర్ బాబు Tue, Nov 12, 2024, 10:22 PM
నేతన్నలు అధైర్య పడవద్దు: మంత్రి పొన్నం Tue, Nov 12, 2024, 10:00 PM
సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య పెన్నిధి Tue, Nov 12, 2024, 09:58 PM
ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి Tue, Nov 12, 2024, 09:56 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Tue, Nov 12, 2024, 09:51 PM