byసూర్య | Wed, Oct 30, 2024, 03:27 PM
రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదర్చుకున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో ఆలోచించుకోవాలన్నారు. హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.