రామగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు

byసూర్య | Wed, Oct 30, 2024, 03:28 PM

పెద్దపల్లి జిల్లా కేంద్రంగా రామగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఆయన నూగిళ్ల మల్లయ్య భూత గడ్డ సంపత్ తాడూరి పుష్పకళా శ్రీమాన్ కలిసి రామగుండం పేరుతో వచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర ప్రభుత్వం రామగుండం పేరుతో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిందని మంత్రి కి వారు వివరించారు.
వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మార్పు చేయాలని వారు మంత్రి శ్రీధర్ బాబును  కోరారు. రామగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వెంటనే ఉన్న కలెక్టర్కు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే రామగుండం తో పాటు మంతిని సుల్తానాబాద్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని కాంగ్రెస్ కౌన్సిలర్లు మంత్రికి విన్నవించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విషయంలో  లో పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు సైతం తన దృష్టికి తీసుకువచ్చారని మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కాంగ్రెస్ కౌన్సిలర్లకు మంత్రి తెలిపారు. మంత్రి హామీ ఇవ్వడంతో కౌన్సిలర్ కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీధర్ బాబు నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.


Latest News
 

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM
4 లైన్ హైవేకు గ్రీన్ సిగ్నల్.. మారనున్న ఆ జిల్లా కేంద్రం రూపురేఖలు Wed, Oct 30, 2024, 08:21 PM