రైతాంగానికి ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 03:34 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీలలో రైతు పండించిన వరి పంట క్వింటాకు 500 బోనస్ కలిపి ఇస్తానన్న హామీని తక్షణమే అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం నర్సంపేట డివిజన్ అధ్యక్షులు గట్టి కొప్పుల రవి  అన్నారు. 
సోమవారం నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రతినిధి బృందంగా  ఇచ్చారు. 
ఈ సందర్భంగా గట్టి కొప్పుల రవి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు పండించిన పంటకు ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఇంకా 50 శాతం అమలు కానీ రెండు లక్షల రైతు పంట రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని కోరారు. రైతు పండించిన పంటలను మధ్యదళారీల ద్వారా కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ చే కొనుగోలు చేయాలని, దళారీల బారిన పడకుండా రైతాంగాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు భరోసా చిన్న, సన్నకారు రైతులకు ఇస్తూ వారిని ప్రోత్సహించే విధంగా కాకుండా నిరుత్సాహపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు కాక, కొత్త రుణాలు అందక ,ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ రైతులను అవస్థల పాలు చేస్తూ, ఆర్థికంగా దోచుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డివిజన్ నాయకులు ధార లింగన్న, జవహర్లాల్ ,మనోహర చారి, సుధాకర్, కట్టన్న, నరేష్ వెంకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM
రాత్రిపూట బట్టలు లేకుండా డ్యాన్స్‌ చేయిస్తున్నారు.. నేనక్కడ ఉండలేను నాన్నా Wed, Oct 30, 2024, 10:41 PM
పోలీసుల విచారణకు సహకరించానన్న రాజ్ పాకాల Wed, Oct 30, 2024, 10:16 PM