byసూర్య | Wed, Oct 30, 2024, 02:49 PM
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం మల్లాపూర్ ఎంపిడివో కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేపై అంగన్వాడీ, ఆశా వర్కర్, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డిపివో రఘువరన్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.