కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున వేర్వేరుగా పరువునష్టం పిటిషన్లు దాఖలు

byసూర్య | Wed, Oct 30, 2024, 02:37 PM

నాగచైతన్య, సమంత విడాకులు, తదితర అంశాలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో నాగార్జున వేర్వేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్లపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున ఆమె న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. తదుపరి విచారణ నవంబర్ 13వ తేదీన జరగనుంది.తనపై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. గత విచారణ సందర్భంగా నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేటీఆర్ మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు. అంతకుముందు, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు వాంగ్మూలం నమోదు చేశారు.


Latest News
 

తిరుమల శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి సతీమణి గీత రెడ్డి Wed, Oct 30, 2024, 04:15 PM
ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ Wed, Oct 30, 2024, 04:13 PM
నూతన కూరగాయల మార్కెట్ 1. 14 కోట్లతో భూమి పూజ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. Wed, Oct 30, 2024, 04:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే Wed, Oct 30, 2024, 04:04 PM
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త Wed, Oct 30, 2024, 03:59 PM