రాజ్య పురస్కార్ కి అర్హత సాధించిన గాయత్రి విద్యానికేతన్ గైడ్స్ విద్యార్థినులు

byసూర్య | Wed, Oct 30, 2024, 01:36 PM

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల గోదావరిఖని లో వారం రోజుల పాటు నిర్వహించిన తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ ఫర్ గైడ్స్ లో  పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన గైడ్స్ జి. వెన్నెల, జె. సాత్విక (8వ తరగతి), జి. శ్రీజ, బి. శ్రీ హర్ష, అదీబా (7 వ తరగతి) లు పాల్గొని తమ ప్రతిభను చూపి రాజ్య పురస్కార్ కి అర్హత సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎసిపి గజ్జి కృష్ణ విద్యార్థినులను, గైడ్ కెప్టెన్ స్రవంతి లను  అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే పిల్లలలో సమాజ సేవ చేయాలనే ఒక గొప్ప ఆలోచనని కలిగిస్తూ, తమ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి తద్వారా విద్యార్థులలో సేవా భావాన్ని పెంపొందిస్తున్న గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించారు.


Latest News
 

ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. అక్కడకు వెళ్లామంటే ఇక స్వర్గమే Mon, Mar 17, 2025, 10:20 PM
నేనెప్పుడూ ఆ పని చేయలేదు, ఇకపై.. హర్షసాయి Mon, Mar 17, 2025, 10:16 PM
యునెస్కో గుర్తింపు కోసం అడుగులు.. ప్రత్యేకత ఏంటంటే Mon, Mar 17, 2025, 10:12 PM
ఆ విషయంలో కలిసి రావాలని ,,కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి Mon, Mar 17, 2025, 10:07 PM
యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం.. ఖాతాల్లోకి రూ.4 లక్షలు Mon, Mar 17, 2025, 10:02 PM