రక్తదానం చేయడానికి అందరు ముందుకు రావాలి

byసూర్య | Wed, Oct 30, 2024, 01:33 PM

పోలీస్ అమరవీరుల వారోత్సవాల (ఫ్లాగ్ డే) సందర్భంగా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదానం శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికిశిబిరాన్ని ముఖ్య అతిధిగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి హాజరై పోలీస్ అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అమరవీర జవానులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా  కమీషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని  ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే ప్రాణ దాతలుగా మారాలని అన్నారు.
అన్నిటికంటే గొప్పదానమైన రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడాలని సూచించారు. సకాలంలో రక్తం అందించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయ్యారని రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు.రక్తదానం ఇవ్వడానికి వాలంటరీగా వచ్చిన వారి అందరిని సీపీ అభినందనలు తెలిపారు. శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత 400 మంది పాల్గొని ఉత్సాహంగా రక్తదానం  చేయడానికి రావడం ఎంతో అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. సీపీ గారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., పెద్దపల్లి ఏసిపి కృష్ణ, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్,  పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది, లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM