రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

byసూర్య | Wed, Oct 30, 2024, 01:31 PM

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, కోమండ్లపల్లి, నీరుకుళ్ళు, గట్టేపల్లి, కదంబాపూర్ గామాల్లో మరియు పట్టణంలోని శాస్త్రి నగర్, పూసాలలో శనివారం రోజున ఐకెపి, సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాలను  స్థానిక నాయకులతో, వ్యవసాయ అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ...గత బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నవడ్లను పండించాలని చెప్పి రైతులకు బోనస్ ఇవ్వడం ఏమో గాని కనీసం వాటిని కొనుగోలు కూడా చేయలేదని అన్నారు. దీంతో అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నారని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని అన్నారు. రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు పంటల పెట్టుబడి తిరిగి రుణాలు ఇస్తున్నట్టు వివరించారు.
సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ వడ్డీలకు సైతం సరిపోలేదని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నిరందీగా ఉండొచ్చని విజయరమణ రావు అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి రైతులు వెంటనే రసీదులు తీసుకుని ఇళ్ళకు వెళ్ళొచ్చని, వడ్ల కటింగ్, రైస్ మిల్లర్లతో రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి కటింగ్ ల పేరిట గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నిలువు దోపిడీ చేశారని, రైతులకు జరిగిన అన్యాయం తనను ఎంతగానో కలిసి వేసిందని , రైతులను ఆదుకోవడమే తన జీవిత లక్ష్యమని విజయరమణ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మినుపాల స్వరూప ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక సతీష్, పట్టణ అధ్యక్షుడు వాగోళం అబ్బయ్య గౌడ్,మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, కలేపల్లి జానీ, కాల్వలా శ్రీనివాస్, ఉస్తేం గణేష్, సతీష్ రావు, ఆనంద్ రావు, సతీష్ , రమేష్, చంద్రయ్య, సతీష్, రవి, సిద్ద తిరుపతి,అజయ్, కనకయ్య, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM