byసూర్య | Wed, Oct 30, 2024, 01:23 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీపావళి కనుకగా మహిళలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపై బుధవారం సాయంత్రంలోగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.