నెక్కొండ మండల కేంద్రంలో సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని బి.ఆర్.యస్ నేతల డిమాండ్

byసూర్య | Wed, Oct 30, 2024, 01:39 PM

నెక్కొండ మండలం లో బి.ఆర్.యస్ పార్టీ మండల నాయకత్వం పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గన్ని మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ హబ్ గా తయారు చేయడం జరిగింది. అందులో నర్సంపేటకు ఎవరు ఊహించని మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల జిల్లా హాస్పిటల్ ను ఏర్పాటుచేసి నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు అదేవిధంగా నెక్కొండ మండలానికి కూడా సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసమే ఆనాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేత ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు, అదేవిదంగా నర్సంపేట లో ఉన్న సివిల్ హాస్పిటల్ వర్ధన్నపేట కూ తరలిస్తున్నారని సమాచారం ఒకవేళ అదే జరిగితే నిరుపేదలకు వైద్య సౌకర్యం ఇబ్బందిగా మారుతుంది కావున ఇప్పుడున్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, నెక్కొండలోని సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని వారు మాట్లాడారు, నెక్కొండ లో సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే నెక్కొండ మండల ప్రజల తో పాటు చుట్టూ పక్క మండలాల పరిసర గ్రామాల పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది అని,వారు తెలిపారు.
కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టక కేవలం బి ఆర్ ఎస్ నాయకులను కార్యకర్తల ను అనగాదొక్కలని చూస్తున్నారని, మీరు ఎంత అనగాదొక్కలని చుసిన మా పార్టీ నాయకులు కార్యకర్తలు అంతకు రెట్టింపు ఉత్సహం తో పని చేస్తారని మాట్లాడారు ,నెక్కొండ లో సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేయకపోతే ఈ దీపావళి పండగ తరువాత మండల వ్యాప్తంగా బి.ఆర్.ఎస్ పార్టీ తరుపున పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు,ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగని  సూరయ్య, మాజీ ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్, మాజీ జడ్పీటీసి సరోజ హరికిషన్ నాయక్, సొసైటీ చైర్మన్ మారం రాము, నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, తాటిపల్లి శివకుమార్,మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య,గాదె భద్రయ్య, కారింగుల సురేష్ గౌడ, వాగ్య నాయక్, లింగ్య, తోట సాంబయ్య, బొల్లెబోయిన విరస్వామి,పట్టణ మాజీ ఉప సర్పంచ్ దేవానబోయిన విరభద్రం,దాసరి శ్రీనివాస్, మాతంగి రాజు, ఖలీల్, సూరయ్య, నవీన్,తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని పాదయాత్ర చేపట్టనున్న బీజేపీ Tue, Nov 12, 2024, 08:04 PM
పేద రైతులతో మాట్లాడాల్సిన సీఎం తన విధిని మరిచాడని విమర్శ Tue, Nov 12, 2024, 08:02 PM
గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. దైవ సన్నిధిలోనే మృత్యు ఒడికి Tue, Nov 12, 2024, 07:55 PM
'నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి'.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ Tue, Nov 12, 2024, 07:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో నలుగురు జీ ఎమ్మెల్యేలకు నోటీసులు Tue, Nov 12, 2024, 07:52 PM