రాష్ట్రంలో తట్ట మట్టి తీసింది లేదు... కొత్తగా చేసింది అసలే లేదని కేటీఆర్ విమర్శ

byసూర్య | Thu, Oct 17, 2024, 03:53 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పైసా పని లేకున్నా... రాష్ట్రానికి రూపాయి లాభం లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు మాత్రం సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ మేరకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.10 నెలల కాలంలో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని, 50 రోజులు దేశ రాజధానిలో పర్యటించారని పేర్కొన్నారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు... ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేశావని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో తట్ట మట్టి తీసింది లేదని, కొత్తగా చేసింది అసలే లేదని విమర్శించారు.అన్నదాతల అరిగోసలు... గాల్లో దీపాల్లా గురుకులాలు... కుంటుపడ్డ వైద్యం... గాడి తప్పిన విద్యా వ్యవస్థ... అయిననూ పోయి రావలె హస్తినకు" అని చురక అంటించారు. "మూసీ పేరుతో, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి, 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి.. అయినను పోయి రావాలె హస్తినకు" అని వ్యంగ్యం ప్రదర్శించారు. పండగలు పండగల్లా లేవు... ఆడబిడ్డల చీరలు అందనేలేదు... అవ్వాతాతలు అనుకున్న పెన్షన్ రాలేదు... తులం బంగారం జాడనే లేదు... స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవని విమర్శించారు.


ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలన శాండ్ మాఫియాకు అభయ హస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందాలు కనిపిస్తున్నాయన్నారు. బడా ఛోటా తేడా లేదు... మంత్రుల నుంచి మండలస్థాయి లీడర్ల వరకు ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటున్నారని పేర్కొన్నారు.అధికారులకు మామూళ్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటుంటే... ఇక అడ్డగోలు తవ్వకాలను... అక్రమ రవాణాను అడ్డుకునేది ఎవరు? అని ప్రశ్నించారు. నదులను... వాగులను... వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ వాళ్లు తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార తవ్వకాలతో యథేచ్ఛగా అడ్డూ అదుపూలేని ఇసుక దోపిడి సాగుతోందన్నారు


Latest News
 

పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM
త్రాగునీటి నాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలి......జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Oct 19, 2024, 03:43 PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం Sat, Oct 19, 2024, 03:38 PM