ఆదమరిస్తే అంతే సంగతులు

byసూర్య | Thu, Oct 17, 2024, 03:53 PM

భారీ వర్షానికి,వరదలకు రోడ్డు దెబ్బతినడంతో ప్రమాదకరంగా మారింది. గత 50 రోజుల క్రితం వచ్చిన వరదలకు 65 నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న సర్వీస్ రోడ్డు కొంతమేర కొట్టుక పోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ద్వారకుంట చెరువు అలుగు నీరు పోవడానికి 65 నెంబర్ జాతీయ రహదారి క్రింద నుండి వాగు ప్రవహిస్తుంది. దీంతో గతంలో వచ్చిన వరదల కారణంగా సర్వీసు రోడ్డు కొంతమేర కొట్టుకుపోయింది.ముఖ్యంగా గ్రామస్తులు కోదాడ నుండి గ్రామంలోకి రావడానికి ఇదే ప్రధాన మార్గం కావడంతో రహదారిపై రద్దీ ఎక్కువగానే ఉంటుంది.
అంతేకాకుండా పశువుల కాపర్లు పశువులను మేపడానికి పోలాలకు వెళుతూ ఉంటారు.ఆదమరిస్తే ఇంతే సంగతి అని గ్రామస్తులు వాపోతున్నారు. వరదలు వచ్చి 50 రోజులు పైగా గడుస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్డు కొంతమేరకు కొట్టుక పోయినా అక్కడ ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదని పలువురు వాపోతున్నారు. కొత్తవారు గ్రామంలోకి వాహనాలతో అతివేగంగా వస్తే ప్రమాదానికి కచ్చితంగా గురవుతారని తెలుపుతున్నారు. రాత్రి వేళల్లో కరెంటు పోయినప్పుడు ఈ రహదారి గుండా పోతే పరిస్థితి ఏంటి అని కచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారిని పునరుద్ధరించాలి అని కోరుతున్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM