బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

byసూర్య | Sat, Oct 19, 2024, 05:03 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. గ్రూపు -1 అభ్యర్ధుల ఆందోళనతో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెంబర్ 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు.వీరికి మద్దతుగా నిలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.గ్రూపు -1 అభ్యర్ధులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణుల తో కలిసి నిరసనకు దిగారు. ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. దీంతో, ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్రటేరియట్‌కు వెళ్లి తీరతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని కేంద్రమంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బండిసంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.


అశోక్‌నగర్ నుంచి ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరిన బండి సంజయ్‌ను తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఆందోళన చేస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులను డీజీపీ జితేందర్ హెచ్చరించారు. గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల మీదికి వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను రక్షించాలనే శుక్రవారం గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనను అరికట్టామని అన్నారు. సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టు కు వెళ్ళాలి కానీ రోడ్ల మీద ఆందోళన చేస్తే ఊరుకోమంటూ డీజీపీ జితేందర్ హెచ్చరించారు.


Latest News
 

'ఈ ఖరీఫ్‌ సీజన్‌కు కూడా రైతు భరోసా లేనట్టే Sat, Oct 19, 2024, 07:06 PM
బండి సంజయ్ పరీక్షా రాసేది లేదు, అర్థంకాదు: కేటీఆర్ Sat, Oct 19, 2024, 07:03 PM
కళ్ల ముందే ప్రేయసి అలా చేయటం తట్టుకోలేక Sat, Oct 19, 2024, 06:59 PM
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ Sat, Oct 19, 2024, 06:52 PM
ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM