రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి

byసూర్య | Sat, Oct 19, 2024, 03:45 PM

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే ఫర్టిలైజర్ దుకాణ యజమానులు విక్రయించాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహరక మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాలలో రైతులు విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు.విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అధిక ధరలకు విక్రయాలు జరిపితే ఉపేక్షించేది లేదన్నారు. విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల స్టాక్ రిజిస్టర్ విధిగా నిర్వహించాలన్నారు. కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతులకు విక్రయించినట్లయితే అటువంటి ఫర్టిలైజర్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్లు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM