ఘనంగా గ్రామీణ మహిళా దినోత్సవం,ప్రపంచ ఆహార దినోత్సవం వేడుకలు

byసూర్య | Thu, Oct 17, 2024, 03:55 PM

పెద్దపల్లి జిల్లా లోని పెద్దకల్వల గ్రామ మహిళలతో గ్రామీణ మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యకారమం లో  జిల్లా మహిళా సాదికరిత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ,జెండర్ స్పెషలిస్ట్, చెంద్రు స్వప్న, ఫైనాన్స్ లిట్రసి సేరు సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు, మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కొరకై, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖి కేంద్రం,చైల్డ్ హెల్ప్ లైన్, భరోసా, షీ టీం వంటి ఎన్నో భద్రత కేంద్రాలు, చట్టాలు,హెల్ప్ లైన్ నంబర్లు ఉన్నాయని తెలిపారు.
ఆర్థిక అక్షరాస్యత గురించి వివరించారు, ఆర్థిక అక్షరాస్యత మహిళా సాధికారతకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు, మహిళలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని, ఫోన్లలో వచ్చే అనవసర మెసేజెస్ మరియు లింకులకు యాప్ లకు ప్రలోభం కావద్దని తెలిపారు. అనంతరం విద్యానగర్ లోని పదవ అంగన్వాడి సెంటర్ కు హాజరై అక్కడికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పౌష్టికాహారము, పోషక విలువలను గురించి వివరించారు, అనంతరం సఖికేంద్రంలో స్వచ్ఛత హై సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈకార్య క్రమం లో సఖి కోఆర్డినేటర్: స్వప్న, సఖి బృందం, ఐసిపిఎస్ సోషల్ వర్కర్: శ్రీనివాస్, మహిళా సాధికారత కేంద్రం అకౌంటెంట్: సమత, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.


Latest News
 

అకాల వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ Sat, Oct 19, 2024, 01:57 PM
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్ Sat, Oct 19, 2024, 01:53 PM
భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు Sat, Oct 19, 2024, 01:50 PM
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు Sat, Oct 19, 2024, 01:49 PM
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం Sat, Oct 19, 2024, 01:49 PM