అకాల వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ

byసూర్య | Sat, Oct 19, 2024, 01:57 PM

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి  ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని  వివిధ మండలాలు నల్లబెల్లి ,ఖానాపూర్, నెక్కొండా మండలాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.నిత్యం కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రాంత  రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 70% పడిపోయినా పత్తి దిగుబడి సమీక్ష జరుపని ప్రజాప్రతినిదులు,అధికారులు. రైతులు పెట్టుబడి పెట్టి నిత్యం శ్రమించిన కనీసం పెట్టిన పెట్టుబడి కి సరిపడ కూడా దిగుబడి రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. రైతులకు పెట్టుబడి సాయంగా రావలసిన రైతు భరోసా రావడం లేదు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగక రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. రైతులకు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి రైతులకు బోనస్ అందివ్వడం లేదు.ఇప్పటికీ సీసీఐ కేంద్రాలు ప్రారంభించకపోవడం వచ్చిన కాస్త దిగుబడి కూడా ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది.పత్తి పంట నష్టపోయిన రైతులకు కచ్చితంగా నష్టపరిహారాన్ని చెల్లించాలని దీనిపై రైతుల పక్షాన సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేస్తాం రైతులను సైతం పోరాటాలకు సిద్ధం చేస్తాం ప్రభుత్వం వెంటనే స్పందించాలని  బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వివిధ మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుODCMS ఛైర్మెన్ ,PACS చైర్మన్ మాజీ ఎంపీపీ, జ్పీటీసి లు ,ఎంపిటిసి, సర్పంచ్ లు,క్లస్టర్ బాధ్యతలు రైతు సంఘం నేతలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ బలరాం నాయక్ Sat, Oct 19, 2024, 04:05 PM
సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి Sat, Oct 19, 2024, 03:55 PM
మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ Sat, Oct 19, 2024, 03:50 PM
పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM