ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ బలరాం నాయక్

byసూర్య | Sat, Oct 19, 2024, 04:05 PM

మహబూబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్ లోని గుంతలను త్వరలో పూడ్చి, దీని శాశ్వత పరిష్కారం కోసం బస్టాండ్ మొత్తం సీసీ ని చేసే విధంగా, చర్యలు తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి, చరవాణిలో స్వయంగా మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్  స్పందిస్తూ, గూడూరు బస్టాండు పునరుద్ధరణ పనులను త్వరలోనే  ప్రారంభిస్తామని హామీ కూడా ఇచ్చారు. రుణమాఫీ కానీ  రైతులు అధైర్య పడవద్దని, త్వరలోనే బడ్జెట్ను విడుదల చేసి, పూర్తిస్థాయిలో రుణమాఫీని దిగ్విజయంగా పూర్తి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం.
10 సంవత్సరాల్లో చేసిన ఏడు లక్షల 50 వేల కోట్లకు ప్రతినెల మిత్తిని చెల్లిస్తున్నామన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథలో 20000 కోట్ల కుంభకోణం జరిగినట్లు రుజువు చేస్తానని, వీటికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయని  పార్లమెంటు సభ్యుడు  బలరాం నాయక్ సవాల్ విసిరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం, ప్రతి నెల 600 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని తూచా తప్పకుండా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి. యాకూబ్ పాషా,సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, కన్నెబోయిన వెంకన్న, చల్ల వెంకట్ రెడ్డి, జిల్లా, మండల, గ్రామసీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM