పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి

byసూర్య | Sat, Oct 19, 2024, 03:49 PM

పెండింగ్ ఉపకార వేతనాలను మరియు ఫీజు రీయంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి శర్దని రాము డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడు యేండ్ల నుంచి రూ.6 వేల కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నారని కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్ జీతాలు ఇవ్వలేక సతమతమవుతున్నారని, కళాశాల భవనాల అద్దెలు చెల్లించకపోతున్నారని కళాశాలలు మూసివేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. దాని ద్వారా విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రైవేటు కళాశాలల యజమాన్యాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని వెంటనే ఉపకార వేతనాలు మరియు ఫీజు రీయింబర్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM