బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు

byసూర్య | Sat, Oct 19, 2024, 01:49 PM

 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 లోని టాస్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుండగా..పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 100 మంది పురుషులను... 42 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


పబ్ నిర్వాహకులు ఈ యువతులను పబ్ కు వచ్చే కస్టమర్లకు ఎరగా వేస్తున్నారు. కస్టమర్లతో చనువుగా ఉంటూ డాన్సులు వేస్తూ వారితోనే పాటు మద్యం సేవిస్తున్నట్లు నటిస్తారు. కానీ వాళ్లు తాగేది కూల్ డ్రింక్స్ . కానీ కస్టమర్ లతో మద్యం తగుతున్నట్లు నమ్మిస్తారు. చివరిగా వారి బిల్లులోనే యువతులు తాగిన బిల్లును కలిపి కస్టమర్ల జేబులకు చిల్లుపెడుతున్నారు.పబ్ లోని మహిళలను బయటకు పంపించి, పురుషులను పబ్ లో నిర్బంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు


 


 


Latest News
 

సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి Sat, Oct 19, 2024, 03:55 PM
మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ Sat, Oct 19, 2024, 03:50 PM
పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM