ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం

byసూర్య | Thu, Oct 17, 2024, 03:57 PM

మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశమని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బుధవారం నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహ ఖేడ్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎంపీ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.....గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిచలానేదే ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం  అందుబాటులోకి రానున్నాయని అన్నారు. నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య  కేంద్రంలో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను  వాటిలోకి తెస్తామని అన్నారు.
అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని అన్నారు. నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జుక్కల్ నియోజకవర్గానికి మరియు అందోల్ నియోజకవర్గానికి మధ్యలో సెంటర్ పాయింట్ గా  ఉన్నందున ఈ ఆస్పత్రికి  అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తదనంతరం మంత్రి నిజాంపేట్ ఆస్పత్రి ఆవరణలో  మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే, పట్లోళ్ల సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, కేజీ ఐఐసీ  చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM