ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

byసూర్య | Fri, Oct 18, 2024, 10:45 PM

వికారాబాద్ జిల్లా కార్యాలయా సముదాయంలోని సమావేశ హలులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి ముఖ్యఅతిథిలు గా పాల్గొని శ్రీ వాల్మీకి మహర్షి చిత్ర ఫటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.  ఈ దినం జాతిని గుర్తుంచుకునే రోజు, ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని,ఇతిహాసాల్లో మొదటిది రామాయణం, పెద్దది మహాభారతం.
అలాంటి రామాయణాన్ని రచించింది ఒక బోయ కులానికి చెందిన చోరుడు అయిన వాల్మీకి. ఈయన ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారని అన్నారు. ఇతిహాసాలోని సారాంశాలను ఈ తరం పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠశాల కరికులంలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి గొప్ప వారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో  ఎస్సి అభివృద్ధి అధికారి మల్లేశం, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, గిరిజన  అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి , జిల్లా వెనుకబడిన తరగతుల అసిస్టెంట్ అధికారి భీమ్ రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM