గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి

byసూర్య | Fri, Oct 18, 2024, 10:42 PM

మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే, ఇందిరమ్మ కమిటీల ద్వారా, నిజమైన పేదలకు న్యాయం చేయాలంటే, ప్రతి గ్రామపంచాయతీలో,గ్రామసభలు నిర్వహించాలి. నిజమైన అర్హులను గుర్తించి, వారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేసే విధంగా కార్యాచరణ ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసే, ఇందిరమ్మ కమిటీలను తమ సొంత కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల వలె ఎంపిక చేయడం, పేదలను మోసం చేసే విధంగా కుట్ర జరుగుతుందని, ఇది చాలా దురదృష్టకరమైన చర్యఅని, గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎర్ర వీరస్వామి కి మెమోరాండాన్ని సమర్పించుకుంటూ, బి ఆర్ఎస్ నాయకులు వాపోయారు.
ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి, పార్టీలకు అతీతంగా  ఎంపిక చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో వేసిన కమిటీలకు, మండల అధికారులు ఆమోదం తెలపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయని పక్షంలో, గూడూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని కార్యక్రమాలను  భారత రాష్ట్ర సమితి మండల కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి  పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్ యాదవ్, మాజీ మండల కో ఆప్షన్స్ సభ్యులు ఎండి రహీం పాషా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాంకుడోత్ కటార్ సింగ్, సంపంగి రాములు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోడ ఎల్లయ్య, గూడూరు టౌన్  యూత్ అధ్యక్షుడు నూకల అశోక్ యాదవ్, బొంత రాములు వాంగుటూరు వెంకన్న చీదురు అనిల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM