మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత

byసూర్య | Fri, Oct 18, 2024, 10:51 PM

వరంగల్ జిల్లా  నల్లబెల్లి మండలంలో 2024 డీఎస్సీ ద్వారా నూతన ఉపాధ్యాయులుగా నియమింపబడిన ఆర్ష నపల్లి, రామతీర్థం, యుపిఎస్ అరవయల్లి, శనిగరం, పంతులు పల్లె నల్లబెల్లి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు  పి ఆర్ టి యు సభ్యత్వము నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రాజేందర్  అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కౌన్సిలింగ్, అప్రెంటిస్ విధానాన్ని రద్దు,  010 ద్వారా వేతనాలను, మహిళా ఉపాధ్యాయులకు ఐదు రోజుల ప్రత్యేక సెలవులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు ఇప్పించిన సంఘం పిఆర్టియు అని పి ఆర్ టి యు సంఘంలో సభ్యత్వం ఒక వరం అని అన్నారు. ఇలాంటి సంఘంలో చేరి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించుటకు పిఆర్టియు సంఘాన్ని బలపరచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు అన్న మహేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులు కె వెంకట రామ నరసయ్య ,జే రామస్వామి, రాష్ట్ర కార్యదర్శి జి సతీష్, ఉపాధ్యాయులు ఎన్ ప్రశాంత్, ఎన్ రాజు, శ్రీనివాస్, కే లింగమూర్తి, కే రామ్మూర్తి, ఓ శ్రీదేవి సుకన్య ,పొన్నమ్మ నూతన ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM