byసూర్య | Tue, Oct 15, 2024, 02:05 PM
గాలి కుంటు వ్యాధి నిరోధక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం వీరన్నపేట మండల పశు వైద్యశాలలో గాలికుంటు వ్యాధి నిరోధక వ్యాక్సినేషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా పశుసంపదతో సమృద్ధిగా ఉండే ప్రాంతమని, పాలు పెరుగు ఉత్పత్తులతో పాలమూరుగా కీర్తి పొందిదన్నారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తదితరులు పాల్గొన్నారు.