byసూర్య | Tue, Oct 15, 2024, 12:50 PM
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రద్దు చేయాలనడానికి బలమైన కారణం కనిపించడం లేదంటూ మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.కాగా.. ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, ఇందులో ఎస్టీ రిజర్వేషన్ చెల్లదంటూ దాదాపు 10 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఇంతకుముందే కొన్ని పిటిషన్లను కొట్టేసింది. ఇక తాజాగా ఈ రోజు (మంగళవారం) చివరి రెండు పిటిషన్లను కూడా కొట్టేస్తూ.. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ప్రిలిమ్స్‌లో పాస్ అయి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో సంతోషం నెలకొంది.