జానీ మాస్టర్‌ కేసులో కీలక పరిణామం.. కోర్టులో నార్సింగి పోలీసుల పిటిషన్

byసూర్య | Mon, Sep 23, 2024, 07:43 PM

టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అసిస్టెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి.. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. జానీ మాస్టర్‌ను చంచల్ గూడా జైలుకు తరలించారు. అయితే.. రిమాండ్ రిపోర్టులో పోలీసులు కేసుకు సంబంధించిన సంచలన విషయాలను పేర్కొన్నారు. అయితే.. కేసు నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉండటంతో.. పోలీసులు తీవ్రంగా గాలించి.. చివరికి గోవాలో అరెస్ట్ చేసి.. హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. జానీ మాస్టర్‌ను విచారించే సమయం దొరకకపోవటంతో.. పోలీసులు కస్టడీకి కోరుతున్నారు.


ఈ క్రమంలోనే.. జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నార్సింగి పోలీసులు సోమవారం (సెప్టెంబర్ 23న) పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే.. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. వారం రోజుల పాటు జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు కావటంతో.. ఆ కేసును రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. ఇదే సమయంలో.. బెయిల్ కోసం జానీ మాస్టర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.


అయితే.. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మాలాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. లైంగిక వేధింపులు, పోక్సో్ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో.. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం దృష్ట్యా.. రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించారు.


ఒకరోజు జానీ మాస్టర్ టీమ్ నుంచి బాధితురాలికి ఓ అమ్మాయి ఫోన్ చేసింది. జానీ మాస్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేస్తారా? అని అడిగింది. బాధితురాలు వెంటనే ఓకే చెప్పింది. ఆ తర్వాత 2019 డిసెంబర్ 15న హైదరాబాద్‌లో జరిగిన అల వైకుంఠపురములో మూవీలోని సాంగ్ షూట్‌లో బాధితురాలు పాల్గొంది. ఇక్కడే మొదటిసారి బాధితురాలు జానీ మాస్టర్‌తో మాట్లాడింది. అంతకు ముందు ఆమె రిహార్సిల్స్ కూడా ఏమీ చేయలేదు.


సాంగ్ షూట్ జరిగిన అదే రోజు జానీ మాస్టర్ మేనేజర్ నుంచి బాధితురాలికి ఫోన్ వచ్చింది. 2020 జనవరి 10న ఒక సాంగ్ షూట్ కోసం ముంబై వెళ్లాలని బాధితురాలికి మేనేజర్ చెప్పాడు. జానీ మాస్టర్, మరో ఇద్దరు మేల్ అసిస్టెంట్స్‌ రాహుల్, మొయిన్‌తో కలిసి బాధితురాలు జనవరి 10న ముంబై వెళ్లింది. జానీ మాస్టర్ తన ఆధార్ కార్డ్, ఇంకొన్ని డాక్యుమెంట్లు బాధితురాలికి ఇచ్చాడు. వీరంతా ముంబైలోని ఓ హోటల్‌లో దిగారు. జానీ మాస్టర్ డాక్యుమెంట్స్‌ని బాధితురాలు తనతో పాటు రూమ్‌కి తీసుకెళ్లింది.


అదేరోజు రాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో జానీ మాస్టర్ నుంచి బాధితురాలికి ఫోన్ కాల్ వెళ్లింది. నా ఆధార్ కార్డు, డాక్యుమెంట్స్ తీసుకుని నా రూమ్‌కి రా అని జానీ మాస్టర్ చెప్పాడు. బాధితురాలు డాక్యుమెంట్స్ తీసుకుని జానీ మాస్టర్ రూమ్‌కి వెళ్లింది. జానీ మాస్టర్ రూమ్ డోర్ తెరిచి ఉంది. ఈమె కాస్త లోపలికి వెళ్లి.. మాస్టర్ నేను రావచ్చా అని అడిగింది. అయితే అప్పటికే డోర్ వెనక ఉన్న జానీ మాస్టర్.. వెంటనే డోర్ క్లోజ్ చేసి బాధితురాలిని లోపలికి తీసుకెళ్లాడు. మాస్టర్ నన్ను వదిలేయండి.. నేను రూమ్‌కి వెళ్లిపోతాను అన్నా వదల్లేదు.


బాధితురాలిని బెడ్ మీదికి తోసేసి.. జానీ మాస్టర్ తన బట్టలు తీసేశాడు. ఆ తర్వాత బలవంతంగా బాధితురాలి బట్టలు కూడా విప్పేశాడు. ఆమె అరుస్తున్నా, ఏడుస్తున్నా.. పట్టించుకోకుండా ఆమెను రేప్ చేశాడు. ఈ విషయం బయట చెప్తే అసిస్టెంట్ పోస్టులో నుంచి తీసేస్తానని.. ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. దీన్ని ఆసారాగా తీసుకుని పలుమార్లు ఆమెను వేర్వేరు ప్రాంతాల్లో రేప్ చేశాడు. ఆఖరికి వ్యానిటీ వ్యాన్‌లోనూ బలవంతంగా అనుభవించాడు. తాను రమ్మన్నప్పుడు బాధితురాలు వెళ్లకపోతే.. ఆమెతో ఒక శాడిస్టులా జానీ మాస్టర్ ప్రవర్తించేవాడు. ఆమెతో మాట్లాడకపోవడం.. పని ఇవ్వకపోవడం.. తోటి అసిస్టెంట్ల దగ్గర ఇన్‌సల్ట్ చేస్తూ మాట్లాడడం చేసేవాడు. ఒకరోజు ఇలాగే బాధితురాలికి జానీ మాస్టర్ ఫోన్ చేసి షూటింగ్ ఉంది రమ్మని అడిగాడు. అయితే, ఇంట్లో అమ్మ లేదని.. తాను ఒంటరిగా ఉన్నానని, తనకు ఒంట్లో బాగోలేదని బాధితురాలు చెప్పింది. కాసేపటికి జానీ మాస్టర్.. బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెను రేప్ చేశాడు. ఇక జానీ మాస్టర్ బాధ భరించలేక అతని అసిస్టెంట్ మొయిన్‌కు జరిగిందంగా బాధితురాలు చెప్పేసింది. దీంతో అతడిపై కంప్లెయింట్ చేయమని మొయిన్ సలహా ఇచ్చాడు.


ఇదిలా ఉంటే, ఒకరోజు జానీ మాస్టర్, అతడి భార్య సుమలత అలియాస్ అయేషా బాధితురాలి ఇంటికి వెళ్లారు. బాధితురాలిని జానీ మాస్టర్ భార్య కూడా బెదిరించింది. బాధితురాలి మీద రంకెలేసింది. రేప్ విషయం బయటకు చెప్తే భవిష్యత్తే లేకుండా చేస్తానని.. తన ఇన్‌ఫ్లుయెన్స్ వాడి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని జానీ మాస్టర్ బెదిరించాడు. దీంతో బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కి కంప్లెయింట్ చేసింది. జానీ మాస్టర్ గురించి జరిగిందంతా చెప్పింది. జానీ మాస్టర్‌తో సంబంధం లేకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండివిడ్యువల్‌గా కొరియోగ్రఫీ వర్క్ చేసుకోవచ్చని అసోసియేషన్ బాధితురాలికి చెప్పింది.


అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2020 జనవరిలో జానీ మాస్టర్ రేప్ చేసేనాటికి బాధితురాలి వయసు 16 సంవత్సరాల 11 నెలల 13 రోజులు. ఈ మేరకు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ కూడా బాధితురాలు పోలీసులకు అందజేసింది. అప్పటికి బాధితురాలు బాలిక కాబట్టి.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్.. పోక్సో కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు.



Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM